టాక్..”అఖండ” రిలీజ్ ఇక్కడ నుంచి తప్పుకుందా.?

Published on Sep 14, 2021 11:10 pm IST


నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ చిత్రం “అఖండ”. భారీ బడ్జెట్ తో బాలయ్య కెరీర్ లోనే నెవర్ బిఫోర్ లెవెల్లో దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కోసం మాస్ సహా బాలయ్య అభిమానులు చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.

మరి ఇప్పుడు షూటింగ్ లాస్ట్ స్టేజ్ లో ఉన్న ఈ చిత్రం రిలీజ్ ఎప్పుడు ఉంటుందా అన్నది కూడా ఆసక్తిగా మారింది. అయితే ఈ సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ వచ్చే దసరా రేస్ లో ఖచ్చితంగా ఉంటుందని టాక్ ఉంది. కానీ లేటెస్ట్ సమాచారం ప్రకారం బహుశా అఖండ రిలీజ్ అప్పుడు ఉండకపోవచ్చట.

కొత్త రిలీజ్ డేట్ కోసం మేకర్స్ చూస్తున్నారట. మరి ఈ చిత్రం రిలీజ్ ఎప్పుడు ఉంటుందో అన్నది కాలమే నిర్ణయించాలి. ఇక ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ద్వారకా క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :