పవన్ “ఓజి” పై ఆసక్తిగా మారిన లేటెస్ట్ బజ్.!

Published on Jan 31, 2023 12:59 pm IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో రీసెంట్ గా అనౌన్స్ చేసిన భారీ చిత్రం కోసం తెలిసిందే. యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి. మరి ఈ చిత్రం కి గాను నిన్ననే హైదరాబాద్ లో గ్రాండ్ గా లాంచ్ కాగా ఈ చిత్రం పై అంచనాలు నిన్నటి నుంచి మరింత స్థాయిలో ఎక్కువయ్యాయి. అయితే ఈ చిత్రంకి గాను పవన్ ఇచ్చిన కాల్షీట్స్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వైరల్ గా మారింది.

మరి ఈ చిత్రం కోసం పవన్ కేవలం 30 రోజులు మేర మాత్రమే డేట్స్ ఇచ్చారని ఆ లోపే సినిమా పవన్ పై కంప్లీట్ అయ్యిపోతుంది అని పలు వార్తలు రాగా ఇందులో ఎలాంటి నిజం లేదని మరికొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ చిత్రాన్ని పవన్ ఫుల్ ఫ్లెడ్జ్ గా ప్లాన్ చేస్తుండగా ఇంత తక్కువ రోజుల్లో కంప్లీట్ చేస్తారా అనేది సస్పెన్స్ గా మారింది. ఈ చిత్రంపై మాత్రం మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :