విజయ్ పొలిటికల్ పార్టీ విషయంలో ఇంట్రెస్టింగ్ బజ్.!

Published on Sep 16, 2023 9:01 am IST


తమిళ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ జోసెఫ్ హీరోగా చేసిన భారీ చిత్రం “లియో” రిలీజ్ కి ఇప్పుడు సిద్ధంగా ఉండగా ఈ చిత్రం అనంతరం అయితే తన కెరీర్ 68వ సినిమాని దర్శకుడు వెంకట్ ప్రభు అంతకు మించిన స్కేల్ లో తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత అయితే విజయ్ సినిమాలు పక్కన పెట్టి రాజకీయాల్లోకి రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే.

దీనితో ఈ విషయంలో అందరి ఆసక్తి దీనిపై కూడా నెలకొనగా లేటెస్ట్ గా అయితే విజయ్ తన పొలిటికల్ పార్టీ విషయంలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్టుగా తెలుస్తుంది. రీసెంట్ గా సెంట్రల్ లో వచ్చిన వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే ప్రాసెస్ నిమిత్తం విజయ్ తన పార్టీ పేరుని ఇతర అంశాలు ఫైనల్ చేసి అతి త్వరలోనే దానిని రిజిస్టర్ చేయాలని చూస్తున్నాడట. ఇది కంప్లీట్ అయ్యాక సినిమా కూడా పూర్తి చేసేసి రాజకీయాల్లో దిగిపోవడమే అన్నట్టుగా ఇప్పుడు తమిళ వర్గాలు చెప్తున్నాయి. మరి విజయ్ తమిళనాట ఎలాంటి పాత్ర పోషిస్తాడో చూడాలి.

సంబంధిత సమాచారం :