ఇంట్రెస్టింగ్..తారక్ ఒకేసారి ఈ రెండు సినిమాలు చేసేస్తాడా.?

Published on Aug 2, 2022 2:58 pm IST


ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తన కెరీర్ లో 30 వ సినిమా కోసం సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. దర్శకుడు కొరటాలతో ఎన్టీఆర్ రెండో సినిమా కావడంతో పాన్ ఇండియా లెవెల్లో భారీ స్థాయి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా కోసం ఎన్టీఆర్ కొన్ని నెలల్లో ప్రిపేర్ అవ్వనుండగా తన లైనప్ లో ఆల్రెడీ సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో సినిమా అనౌన్స్ అయ్యిన సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమాతో పాటుగా మరో దర్శకుడు బుచ్చిబాబు సానా తో ఓ క్రేజీ ప్రాజెక్ట్ కూడా ఎన్టీఆర్ చేస్తున్నట్టుగా తెలిసిందే. కాకపోతే ఆ చిత్రం ఇంకా అనౌన్స్ కాలేదు కానీ సినిమా అయితే ఉందని రీసెంట్ గానే అందరికీ కన్ఫర్మ్ అయ్యిపోయింది. ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ టాక్ ఎన్టీఆర్ సినిమాలపై వినిపిస్తుంది. మరి తర్వాత అయితే ఇప్పుడు కొరటాలతో పాటుగా దర్శకుడు బుచ్చిబాబుతో సినిమా కూడా ఒకేసారి స్టార్ట్ చేసి షూటింగ్ లో ఏకకాలంలో పాల్గొననున్నట్టుగా బజ్ వినిపిస్తుంది. మరి దీనిపై అయితే అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :