“బ్రో” లో ఫీస్ట్ గా ఈ సాంగ్.!

Published on Jun 7, 2023 11:07 am IST


మెగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అయితే లేటెస్ట్ గా “విరూపాక్ష” తో అందుకున్నాడు. మరి భారీ వసూళ్లతో తన కెరీర్ లో మొదటి 100 కోట్ల గ్రాసర్ గా నిలిచిన ఈ చిత్రం తర్వాత మరో సాలిడ్ ప్రాజెక్ట్ “బ్రో” తో అయితే ఇపుడు రాబోతున్నాడు. మరి ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రెజెన్స్ కూడా ఉండడంతో ఈ ప్రాజెక్ట్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది.

అలాగే వెర్సటైల్ నటుడు సముద్రఖని ఈ చిత్రాన్ని దర్శకత్వం వహిస్తుండగా ఇప్పటికే వచ్చిన పోస్టర్ లు మోషన్ పోస్టర్ టీజర్ లకి సాలిడ్ ఫీడ్ బ్యాక్ రాగా లేటెస్ట్ గా అయితే థమన్ కంపోజ్ చేసిన ఓ సూపర్ బీట్ కోసం ఇప్పుడు ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెలుస్తుంది.

ఊర్వశి తోనే ప్లాన్ చేసిన ఈ సాంగ్ లో పవన్ మరియు సాయి ధరమ్ తేజ్ లు కూడా మెస్మరైజ్ చేయనున్నారట. మరి తేజ్ అయితే తన డాన్స్ మూమెంట్స్ తో ఈ సాంగ్ లో అదరగొట్టనుండగా పవన్ కూడా తన మార్క్ స్వాగ్ అండ్ డ్రెస్సింగ్ స్టైలింగ్ తో అయితే ఫ్యాన్స్ కి ఫీస్ట్ ఇస్తాడని తెలుస్తుంది. మొత్తానికి అయితే ఓ సూపర్ స్పెషల్ సాంగ్ సినిమాలో ఉంటుందని అర్ధం అవుతుంది.

సంబంధిత సమాచారం :