అవైటెడ్ “ఆచార్య” ట్రైలర్ పై లేటెస్ట్ బజ్.!

Published on Apr 7, 2022 2:00 pm IST

టాలీవుడ్ నుంచి రాబోతున్న లేటెస్ట్ మరో మోస్ట్ అవైటెడ్ క్రేజీ మల్టీ స్టారర్ సినిమా “ఆచార్య” కోసం అందరికీ తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెగా తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరో హీరోగా నటించిన ఈ సినిమాని బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ సినిమా ట్రైలర్ కోసం అయితే చాలా ఎగ్జైటింగ్ గా చూస్తున్నారు.

మరి రీసెంట్ గానే ఈ ట్రైలర్ కోసం అనౌన్స్ చెయ్యగా అందరిలో మరింత ఆసక్తి పెరిగింది. ఇక ఇప్పుడు అయితే ఈ ట్రైలర్ పై ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తుంది. ఈ ట్రైలర్ మెగా ఫ్యాన్స్ కి ఓ రేంజ్ లో ట్రీట్ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా చిరు మరియు చరణ్ ల మీద సీన్స్ గాని ఇద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ గాని ట్రైలర్ లో అదిరిపోయాయట. ఖచ్చితంగా ఈ ట్రైలర్ అందరి అంచనాలు అందుకునే రేంజ్ లో ఉంటుంది అని తెలుస్తుంది. మరి ఈ ట్రైలర్ రిలీజ్ డేట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :