“ఆచార్య” గ్రాండ్ ఈవెంట్ గెస్ట్ పై ఆసక్తికర బజ్..!

Published on Dec 2, 2021 2:02 pm IST

మెగాస్టార్ చిరంజీవి మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన మెగా మల్టీ స్టారర్ చిత్రం “ఆచార్య”. భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం నుంచి రీసెంట్ గా వచ్చిన సిద్ధ టీజర్ కి కూడా భాయీ రెస్పాన్స్ కూడా వచ్చింది.

మరి ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి రానున్న రోజుల్లో రాబోయే ట్రీట్స్ కోసం పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి అయితే ఈ సినిమా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరయ్యే గెస్ట్ పైనే టాక్ మొదలయింది. మరి దీని ప్రకారం ఈ బిగ్గెస్ట్ ఈవెంట్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హాజరు అవుతాడట.

ఇదే టాక్ ఇప్పుడు వైరల్ అవుతుంది. మరి ఇందులో ఎంత వరకు నిజముందో కానీ నిజం కాదు అని చెప్పడానికి ఆస్కారం అయితే ఎక్కడా లేదు. చరణ్ మరియు తారక్ లకి మంచి బాండింగ్ ఆల్రెడీ ఉంది. పైగా ఈ సినిమా తర్వాత కొరటాల ఎన్టీఆర్ తోనే సినిమా చేయనున్నాడు. సో తారక్ వచ్చినా ఆశ్చర్యం లేదని చెప్పొచ్చు. మరి వస్తాడా లేదా అన్నది కాలమే నిర్ణయించాలి.

సంబంధిత సమాచారం :