“ఆదిపురుష్” ట్రైలర్ 2 పై మరో ఇంట్రెస్టింగ్ బజ్.!

Published on Jun 6, 2023 7:11 am IST


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు ఓంరౌత్ తో చేసిన మోస్ట్ అవైటెడ్ చిత్రం “ఆదిపురుష్” కోసం అందరికీ తెలిసిందే. రామాయణ ఇతిహాస ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రం విడుదల ఇప్పుడు మరింత హైప్ ఎక్కిస్తుండగా ఈరోజు గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ పై అందరి కళ్ళు ఉన్నాయి. ఇక దీనితో పాటుగా ఆల్రెడీ సినిమా నుంచి మరో సాలిడ్ ట్రైలర్ కట్ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

మరి దీనిపై మరో ఇంట్రెస్టింగ్ బజ్ ఇప్పుడు తెలుస్తుంది. మంచి యాక్షన్ ఫీస్ట్ తో ఉండే ఈ ట్రైలర్ లో ప్రభాస్ పై చూపించే యుద్ద సన్నివేశాలు మరింత లెవెల్లో ఊహించని విజువల్స్ తో ఉండబోతున్నాయట. అలాగే సైఫ్ పై మరిన్ని సీన్స్ ఉండొచ్చని కూడా తెలుస్తుంది. ఇక ఈ అవైటెడ్ చిత్రం ఈ జూన్ 16న బిగ్ స్క్రీన్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.

సంబంధిత సమాచారం :