టాక్..”ఏజెంట్” ఓటిటి రిలీజ్ పై ఇంట్రెస్టింగ్ బజ్.!

Published on Jun 10, 2023 11:12 am IST


అఖిల్ అక్కినేని హీరోగా సాక్షి వైద్య హీరోయిన్ గా మన టాలీవుడ్ స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించిన లేటెస్ట్ భారీ చిత్రం “ఏజెంట్” కోసం తెలిసిందే. ఓ స్పై యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా అయితే అనూహ్యంగా భారీ ప్లాప్ గా నిలిచిపోయింది.

మరి ఈ సినిమా ప్లాప్ తో అయితే మేకర్స్ ఈ మిస్టేక్ ని ఓన్ చేసుకొని ఆడియెన్స్ కి ఫ్యాన్స్ కి క్షమాపణలు కూడా చెప్పారు. ఇక ఈ చిత్రం ఓటిటి రిలీజ్ విషయంలో కూడా అలా సస్పెన్స్ నెలకొనగా ఎప్పుడో మే లో రావాల్సిన ఈ సినిమా జూన్ కి పోస్ట్ పోన్ అయ్యింది. ఇక ఈ చిత్రంపై అయితే ఇంట్రెస్టింగ్ బజ్ ఒకటి ఇప్పుడు తెలుస్తుంది.

ఓటిటి వెర్షన్ లో మాత్రం కాస్త కొత్త కట్ ని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని ఇప్పటికే తెలిసిందే. మరి ఇదైతే చాలా వరకు థియేటర్లు లో చూసిన సినిమా కంటే బెటర్ అవుట్ పుట్ తో ఉంటుంది అని తెలుస్తుంది. థియేట్రికల్ వెర్షన్ లో పెట్టలేకపోయిన కొన్ని ఇంట్రెస్టింగ్ సీక్వెన్స్ లు కూడా ఈ కొత్త వెర్షన్ లో యాడ్ చేస్తారని తెలుస్తుంది. మొత్తానికి అయితే ఈ కొత్త వెర్షన్ ఏజెంట్ ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :