ఇంట్రెస్టింగ్ బజ్..ఇంకా హోల్డ్ లోనే “అఖండ” డేట్.!

Published on Sep 22, 2021 6:57 pm IST


నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం “అఖండ”. తన హిట్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ప్లాన్ చేసిన ఈ భారీ హ్యాట్రిక్ చిత్రంపై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. మరి ఇదిలా ఉండగా ఈ సినిమాపై ఎపుడు నుంచో ఎదురు చూస్తున్న అవైటెడ్ ఫస్ట్ సింగిల్ ని మేకర్స్ ఇటీవలే రిలీజ్ చేసి హిట్ కొట్టారు. మరి ఎప్పుడు నుంచో ఈ సినిమాకి డౌట్ గా ఉన్న ప్రశ్న మాత్రం రిలీజ్ డేట్ విషయంలోనే అని చెప్పాలి.

అంతా ఈ బిగ్గెస్ట్ యాక్షన్ మాస్ ట్రీట్ కోసం చాలా ఎదురు చూస్తున్నారు కానీ పరిస్థితులు మాత్రం అందుకు సహకరించడం లేదు.. కానీ గత కొన్నాళ్ల నుంచి దసరా కానుకగా సినిమా రిలీజ్ ఉంటుంది అని బజ్ ఉండగా ఇంకా రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేయకపోవడంతో ఇది మిలియన్ డాలర్ ప్రశ్న గానే మిగిలింది.

అయితే ఇప్పుడు వస్తున్న ఇంట్రెస్టింగ్ బజ్ ప్రకారం “అఖండ” దసరా రేస్ కే స్టిక్ అయ్యి ఉందని తెలుస్తుంది. కానీ ఇప్పుడు మిగిలి ఉన్న తక్కువ సమయంలో ఇది సాధ్యపడుతుందా అన్నదే ప్రశ్న. మరి అన్ని అప్డేట్స్ కూడా సడెన్ సడెన్ గా ఇస్తూ వచ్చి చేస్తారేమో చూడాలి. ఇక ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందించాడు. అలాగే ద్వారకా క్రియేషన్స్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :