“అఖండ” షూట్ పై ఇంట్రెస్టింగ్ బజ్.!

Published on Sep 14, 2021 3:20 pm IST


నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న తాజా చిత్రం “అఖండ”. మాస్ లో విపరీతమైన అంచనాలు పెంచుకున్న ఈ చిత్రం రిలీజ్ పై ఆసక్తి ఓ పక్క పెరుగుతుండగా మేకర్స్ ఈ సినిమాని ఫైనల్ స్టేజ్ షూట్ నుంచి ఫినిష్ చేసే పనిలో ఉన్నారు. అయితే మేకర్స్ ఈ షూట్ కోసం గోవా వెళ్లిన సంగతి తెలిసిందే.

దీనిపైనే మరింత సమాచారం ఇప్పుడు వినిపిస్తుంది. ఈ సాంగ్ ని చాలా గ్రాండ్ గా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అంతే కాకుండా మరో సాంగ్ ని కూడా మాసివ్ లెవెల్లో ఈ నెలాఖరున ని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఆల్బమ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని కూడా అభిమానులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. అలాగే ఈ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :