అకిరా డెబ్యూ పై ఇంట్రెస్టింగ్ బజ్!

అకిరా డెబ్యూ పై ఇంట్రెస్టింగ్ బజ్!

Published on Feb 19, 2025 7:05 AM IST

టాలీవుడ్ లో కొందరు హీరోల తాలూకా వారసుల ఎంట్రీపై మాత్రం వారి అరంగేట్రంకి ముందు నుంచే ఓ రేంజ్ హైప్ నెలకొంటుంది. అలా ఈ మధ్య కాలంలో ఒకప్పుడు నుంచి నందమూరి నటసింహం బాలకృష్ణ వారసుడు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీపై సాలిడ్ హైప్ నెలకొనగా ఇపుడు మరో బిగ్ స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడు అకిరా నందన్ ఎంట్రీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే అకిరా ఎంట్రీపై ఇప్పుడు వరకు చాలా ఊహాగానాలు వినిపిస్తూనే వచ్చాయి. ఓ పక్క సంగీతం పరంగా థమన్ ఓజి సినిమా కోసం అకిరాతో వర్క్ చేస్తా అని చెప్పాడు. కానీ నటుడుగా ఎప్పుడు డెబ్యూ ఇస్తాడు అనేది ఇప్పుడు తెలుస్తోంది. లేటెస్ట్ టాక్ ప్రకారం అకిరా వచ్చే మరో రెండేళ్ల తర్వాత వెండితెరపై హీరోగా పరిచయం కాబోతున్నాడని తెలుస్తోంది. సో పవన్ అభిమానులు ఇంకో రెండేళ్లు అకిరా కోసం ఆగాల్సిందే అని చెప్పాలి. మరి చూడాలి తన ఎంట్రీ ఎవరితో ఎలా ఉంటుంది అనేది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు