“భీమ్లా నాయక్” ఓటిటి రిలీజ్ పై ఇంట్రెస్టింగ్ బజ్.!

Published on Mar 4, 2022 7:00 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటిలు హీరోలుగా దర్శకుడు సాగర్ కె చంద్ర తెరకెక్కించిన సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ చిత్రం “భీమ్లా నాయక్”. గత వారం రిలీజ్ అయ్యిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో మరియు ఓవర్సీస్ మార్కెట్ లో మాస్ హిట్ అయ్యింది. మంచి ఓపెనింగ్స్ అందుకొని ఇప్పుడు గుడ్ హోల్డ్ లో నిలబడింది. మరి ఇప్పుడు ఈ సినిమా ఓటిటి రిలీజ్ పై లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది.

ఈ సినిమాని ప్రముఖ ఓటిటి సంస్థలు ఆహా మరియు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు ఈ సినిమా హక్కులు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. మరి ఈ రెండిట్లో ఈ చిత్రం ఎప్పుడు నుంచి స్ట్రీమ్ అవుతుందో తెలుస్తుంది. అయితే ఈ లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ చిత్రం ఈ మార్చ్ నెలలోనే స్ట్రీమింగ్ కి వస్తుందట. బహుశా ఈ నెల చివరి వారంలో స్ట్రీమింగ్ కి రానున్నట్టు తెలుస్తుంది. మరి వేచి చూడాలి ఈ మెన్స్ ఎంటర్టైనర్ ఓటిటి లో ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో.

సంబంధిత సమాచారం :