“భీమ్లా నాయక్” ఓటిటి రైట్స్ పై మరో ఇంట్రెస్టింగ్ బజ్.!

Published on Feb 19, 2022 1:04 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా లు హీరోలుగా నటించిన లేటెస్ట్ చిత్రం “భీమ్లా నాయక్” హవా టాలీవుడ్ లో నడుస్తున్న సంగతి తెలిసిందే. ఓ పక్క ట్రైలర్ కోసం ఇంకో పక్క ప్రీ రిలీజ్, ఓవర్సీస్ బుకింగ్స్ ఇలా అన్నిటిలో భారీ హైప్ తో ఈ చిత్రం పై ఎంతో ఆసక్తి నెలకొంది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ పై కొన్ని ఇంట్రెస్టింగ్ వార్తలే వినిపించిన సంగతి తెలిసిందే.

అయితే వీటితో పాటుగా భీమ్లా నాయక్ ఓటిటి డీల్ పై కూడా టాక్ బయటకి వచ్చింది. ఈ సినిమా తాలుకా ఓటిటి హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ అయినటువంటి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వాళ్ళు కొనుగోలు చేసారని తెలిసిందే. మరి వీరితో పాటుగా మరో స్ట్రీమింగ్ సంస్థ కూడా స్ట్రీమింగ్ హక్కులు తీసుకున్నారట. వారే మన తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ “ఆహా” వారు. ఈ రెండు ఓటిటి సంస్థల్లో భీమ్లా నాయక్ డిజిటిల్ రిలీజ్ ఉంటుంది అని సినీ వర్గాల్లో లేటెస్ట్ టాక్ ఇపుడు వైరల్ అవుతుంది.

సంబంధిత సమాచారం :