“భీమ్లా నాయక్” రిలీజ్ పై ఇంట్రెస్టింగ్ బజ్.!

Published on Jan 4, 2022 11:00 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి లు ప్రధాన పాత్రల్లో దర్శకుడు సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్న భారీ సినిమా “భీమ్లా నాయక్”. మళయాళ హిట్ సినిమా అయ్యప్పణం కోషియం కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ మాస్ మసాలా డ్రామా నిజానికి ఈ సంక్రాంతి రేస్ లో రిలీజ్ కావాల్సి ఉండగా పలు కారణాల చేత ఈ సినిమా ఫిబ్రవరి నెలకి షిఫ్ట్ అయ్యిపోయింది.

ఇక ఇదిలా ఉండగా మళ్ళీ సంక్రాంతి రేస్ నుంచి భారీ సినిమా “RRR” తప్పుకోవడంతో మళ్ళీ “భీమ్లా నాయక్” రిలీజ్ పై ఆసక్తి రేగింది. కానీ ఈ సంక్రాంతి బరిలో సినిమా ఉంటుందా లేదా అనే దానిపై లేటెస్ట్ బజ్ ఒకటి వినిపిస్తుంది. ఈ సినిమా సంక్రాంతి రేస్ లో రిలీజ్ కాదట అనుకున్నట్టు గానే ఫిబ్రవరిలో రిలీజ్ అవుతుందట. మరి దీనికి కారణం కూడా తెలుస్తుంది.

ప్రస్తుతం ఈ సినిమాకి ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ వర్క్ బ్యాలన్స్ ఉందట కానీ థమన్ ఏమో రాధే శ్యామ్ సినిమాకి లాక్ అయ్యి ఉండడం వల్ల భీమ్లా నాయక్ అనుకున్న సంక్రాంతి రేస్ లో రిలీజ్ అవ్వడం సాధ్యపడదు అని తెలుస్తుంది. సో ఫిబ్రవరి వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :