“భీమ్లా నాయక్” టీజర్ పై ఇంట్రెస్టింగ్ బజ్.!

Published on Oct 28, 2021 7:02 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి కాంబోలో తెరకెక్కిస్తున్న సాలిడ్ మల్టీ స్టారర్ సినిమా “భీమ్లా నాయక్”. దర్శకుడు సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్న ఈ క్రేజీ రీమేక్ సినిమాపై ఎప్పటికప్పుడు మేకర్స్ అదిరే అప్డేట్స్ ను ఇస్తూ వస్తున్నారు. అలాగే ఈ సినిమా నుంచి కొన్ని సడెన్ అప్డేట్స్ కూడా వచ్చాయి. అయితే కాస్త ముందుగా అనౌన్సమెంట్స్ ఇస్తూ మంచి హైప్ లో తెచ్చిన అప్డేట్స్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది.

అలానే ఈసారి టీజర్ కి ప్లాన్ చెయ్యబోతున్నట్టు తెలుస్తుంది. అదిరే మాస్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా టీజర్ కట్ ను మేకర్స్ సిద్ధం చేస్తున్నారట. ఇంకా దీని లాంచ్ ఎప్పుడు ఉంటుంది అనేది క్లారిటీ లేదు కానీ కరెక్ట్ ప్లానింగ్ తో రిలీజ్ చేయనున్నారట. ఏమో బహుశా దీపావళి కానుకగా కూడా రావొచ్చేమో కానీ టీజర్ కోసం మాత్రం అంతా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :