“బ్రో” మ్యూజిక్ ఆల్బమ్ పై ఇంట్రెస్టింగ్ బజ్.!

Published on May 23, 2023 6:46 pm IST


ప్రస్తుతం టాలీవుడ్ దగ్గర రాబోతున్న ఇంట్రెస్టింగ్ మల్టీ స్టారర్ చిత్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రం “బ్రో ది అవతార్” కూడా ఒకటి. మరి ఫస్ట్ లుక్ తో సాలిడ్ రెస్పాన్స్ అందుకున్న ఈ చిత్రం పై మంచి అంచనాలు నెలకొనగా ఈ సినిమా మ్యూజిక్ పై కూడా సాలిడ్ బజ్ ఉంది. మెయిన్ గా సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా థమన్ ఇచ్చిన స్కోర్ ఇన్ స్టాంట్ గా హిట్ అయ్యింది.

మరి ఇదిలా ఉండగా బ్రో మ్యూజిక్ ఆల్బమ్ పై అయితే ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెలుస్తుంది. ఈ చిత్రంలో అయితే మొత్తం ఐదు పాటలు ఉండగా వాటిలో పవన్ పైనే రెండు పాటలు ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి థమన్ ఇప్పటివరకు పవన్ సాలిడ్ మ్యూజిక్ అందించాడు. మరి ఈ చిత్రంకి ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రాన్ని సముద్రఖని దర్శకత్వం వహిస్తుండగా త్రివిక్రమ్ మాటలు అందిస్తున్నారు అలాగే ఈ అవైటెడ్ సినిమా అయితే ఈ జూలై 28న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం :