బన్నీ ‘నా పేరు సూర్య’ చిత్రం పై ఆసక్తికరమైన అప్డేట్ !
Published on Feb 17, 2017 12:30 pm IST


స్టార్ హీరో అల్లు అర్జున్, రచయిత నుండి దర్శకుడిగా మారనున్న వక్కంతం వంశీ మొదటి సినిమాలో నటించనున్నాడనే వార్త బయటికొచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ చిత్రంపై మరో ఆసక్తికరమైన వార్త ఒకటి సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే ఏప్రిల్ 8న బన్నీ పుట్టినరోజు సందర్బంగా ఈ చిత్రం అధికారికంగా లాంచ్ అవుతుందట.

‘నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా’ అనే టైటిల్ ప్రచారంలో ఉన్న ఈ ప్రాజెక్టులో అల్లు అర్జున్ మునుపెన్నడూ లేని విధంగా చాలా భిన్నంగా కనిపిస్తాడని అంటున్నారు. ఈ చిత్రానికి బాలీవుడ్ సంగీత దర్శకులు విశాల్ – శేఖర్ లేదా అజయ్ – అతుల్ లో ఎవరో ఒకరిని తీసుకుంటారని కూడా అంటున్నారు. లగడపాటి శ్రీధర్ నిర్మించనున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేస్తారట. అయితే ఈ ప్రాజెక్ట్ పై ఇన్ని వార్తలొస్తున్నా సంబంధిత వ్యక్తుల నుండి ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

 
Like us on Facebook