చరణ్, ఎన్టీఆర్ ల మల్టీ స్టారర్ పై ఆసక్తికరమైన వార్త !
Published on Nov 29, 2017 8:31 am IST

దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం చరణ్, ఎన్టీఆర్ ల కలయికలో ఒక మల్టీ స్టారర్ ను రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తండ్రి విజయేంద్ర ప్రసాద్ తో కలిసి ఆయన కథను సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ఇదిలా ఉండగా ఈ చిత్రం గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త తెగ చక్కర్లు కొడుతోంది.

అదేమిటంటే ఈ సినిమా ఒక స్పోర్ట్స్ డ్రామాగా ఉండనుందని, ఇందులో చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ కూడా బాక్సర్లుగా కనిపిస్తారట. అందుకే వీరిద్దరూ ప్రొఫెషనల్ బాక్సర్ల వద్ద ట్రైనింగ్ తీసుకుంటారని తెలుస్తోంది. అయితే ఈ వార్తలో ఎంత మాత్రం నిజముందో ఇంకా తెలియాల్సి ఉంది. వచ్చే ఏడాది వేసవికి మొదలుకానున్న ఈ సినిమాను 2019 వేసవికి పూర్తిచేయాలనే ఆలోచనలో ఉన్నారు రాజమౌళి.

సుమారు రూ. 150 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మించనున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి మార్కెట్ దేశవ్యాప్తమవడంతో ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, హిందీల్లో కూడా రూపొందించనున్నట్లు తెలుస్తోంది.

 
Like us on Facebook