“గుంటూరు కారం” ఫస్ట్ సింగిల్ పై ఇంట్రెస్టింగ్ బజ్.!

Published on Sep 3, 2023 4:00 pm IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా యంగ్ హీరోయిన్ శ్రీలీల అలాగే మీనాక్షి చౌదరిలు హీరోయిన్స్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పక్కా మాస్ ఎంటర్టైనర్ చిత్రం “గుంటూరు కారం” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా మహేష్ కెరీర్ లోనే భారీ అంచనాలు నెలకొల్పుకోగా ఇప్పుడు సినిమా షూటింగ్ అయితే శరవేగంగా కంప్లీట్ అవుతుంది.

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ కోసం అంతా ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తూ వస్తున్నారు. మరి ఈ ఫస్ట్ సాంగ్ పై అయితే లేటెస్ట్ అప్డేట్ ఒకటి తెలుస్తుంది. మేకర్స్ ఈ సాంగ్ గా హీరో ఇంట్రడక్షన్ కాకుండా ఓ సూపర్ మెలోడిని దింపే యోచనలో ఉన్నట్టుగా ఇప్పుడు రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి ఇంకా షూట్ ఫినిష్ కావాల్సి ఉండగా అది అయ్యాక ఈ సాంగ్ లాంచ్ అయ్యే ఛాన్స్ ఉందని టాక్. మరి ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా హారికా హాసిని వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :