“వీరమల్లు” షూటింగ్ పై ఇంట్రెస్టింగ్ బజ్.!

“వీరమల్లు” షూటింగ్ పై ఇంట్రెస్టింగ్ బజ్.!

Published on Oct 27, 2022 8:59 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా చేస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “హరిహర వీరమల్లు” కోసం అందరికి తెలిసిందే. మరి వీరమల్లు చిత్రాన్ని అయితే దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తుండగా దీనిపై భారీ అంచనాలు కూడా నెలకొన్నాయి. పవన్ కెరీర్ లో ఇది మొదటి పాన్ ఇండియా సినిమాగా చేస్తుండగా దీనితో ఈ చిత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది.

ఇక ఈ చిత్రం అయితే గ్యాప్ దొరికినప్పుడల్లా పవన్ తో షూటింగ్ ని మేకర్స్ చేస్తుండగా లేటెస్ట్ గా కూడా పవన్ తన పొలిటికల్ హీట్ నుంచే మళ్ళీ స్టార్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ బజ్ ఏమిటంటే ఈ చిత్రం షూటింగ్ ఈరోజు నుంచి మరో రెండు వారాల పాటు నిర్విరామంగా జరగనున్నట్టు తెలుస్తుంది.

మరి ఈ షూటింగ్ లో అయితే పవన్ కూడా పాల్గొననున్నట్టు కూడా టాక్. ఇక ఈ భారీ చిత్రానికి అయితే ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా మెగా సూర్య ప్రొడక్షన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు