తారక్ నెక్స్ట్ పై ఇంట్రెస్టింగ్ బజ్.!

Published on Aug 18, 2021 12:15 am IST

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శక ధీరుడు రాజమౌళి తో “RRR” అనే భారీ పాన్ ఇండియన్ మల్టీ స్టారర్ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. మరి దీని తర్వాత తన హిట్ అండ్ బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివతో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియన్ లెవెల్లో మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి ఇదిలా ఉండగా ఈ చిత్రంపై లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ బజ్ ఒకటి వినిపిస్తుంది. గత కొన్నాళ్ల నుంచి ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు అన్నది ఆసక్తికరంగా మారిన ప్రశ్న.

అయితే దానికి ఇంకొన్ని రోజుల్లో తెర పడనున్నట్టు సమాచారం. మరి ఈ లిస్ట్ లో ముందు నుంచి అనుకుంటున్నా కియారా పేరు ఫిక్స్ అవుతుందా లేక మరో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పేరు ఫైనల్ అవుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. అలాగే ఇప్పటికే ఈ చిత్రానికి సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ సంగీతం ఇవ్వనున్నాడని స్ట్రాంగ్ బజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఏది ఏమైనప్పటికీ మాత్రం ఈ బిగ్ ప్రాజెక్ట్ ఎప్పుడెప్పుడు మొదలు కానుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :