ఎన్టీఆర్ – కొరటాల సినిమా పై ఇంట్రెస్టింగ్ బజ్ !

ఎన్టీఆర్ – కొరటాల సినిమా పై ఇంట్రెస్టింగ్ బజ్ !

Published on Nov 21, 2022 12:01 AM IST

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఎన్టీఆర్ సినిమాలో నటిస్తోంది అంటూ ఇప్పటికే రూమర్స్ వినిపించాయి. తెలుగు సినిమాలు చేయడానికి జాన్వీ కపూర్ బాగా ఆసక్తిగా ఉందట. రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కూడా తన తల్లి శ్రీదేవి చేసిన సౌత్ సినిమాలు అంటే.. తనకు బాగా ఇష్టం అని.. అందుకే తాను కూడా సౌత్ సినిమాలు చేయాలనుకుంటున్నట్లు జాన్వీ కపూర్ చెప్పుకొచ్చింది. మరి జాన్వీ మాటలను బట్టి ఆమె ఎన్టీఆర్ సినిమాలో నటించే ఛాన్స్ ఉంది.

ప్రస్తుతం ఎన్టీఆర్ – కొరటాల సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ రోజు కూడా సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ తో కొరటాల శివ మ్యూజిక్ సిట్టింగ్స్ లో కూర్చున్నాడు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ కూడా అదిరిపోతోందట. అందుకు తగ్గట్టుగానే తన పాత్ర కోసం తారక్ కూడా డిఫరెంట్ మేకోవర్‌ ట్రై చేస్తున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్ లో గతంలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ పెద్ద హిట్ కావడంతో ఈ సినిమా పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు