ఎన్టీఆర్ తో కమల్ హాసన్.. ప్రశాంత్ నీల్ సినిమా పై క్రేజీ రూమర్ ?

ఎన్టీఆర్ తో కమల్ హాసన్.. ప్రశాంత్ నీల్ సినిమా పై క్రేజీ రూమర్ ?

Published on May 17, 2022 3:02 AM IST

పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ తో ఓ భారీ యాక్షన్ డ్రామా తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ 31వ సినిమాగా ఈ చిత్రం రాబోతుంది. ఈ చిత్రంలో మరో కీలక పాత్ర కూడా ఉందట. ఈ పాత్ర సినిమాకే మెయిన్ హైలైట్ గా నిలుస్తోందట. అందుకే, ఈ పాత్ర కోసం కమల్ హాసన్ ను ఒప్పించాలని ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తునట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఈ రూమర్స్ లో ఎంత నిజం ఉందో చూడాలి.

ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపికా పదుకొణెను హీరోయిన్ గా తీసుకునే ఆలోచనలో ఉంది టీమ్. ఇక ఈ చిత్రం రెగ్యులర్ షూట్ ను ప్రశాంత్ నీల్ అక్టోబర్‌ నుంచి ప్లాన్ చేస్తున్నాడు. అక్టోబర్‌ సెకండ్ వీక్ నుంచి ఈ సినిమా సెట్స్‌ పైకి వెళ్లనుంది. ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కలయికలో సినిమా వస్తోంది అనేసరికి నేషనల్ రేంజ్ లో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ కి, ప్రశాంత్ నీల్ యాక్షన్ విజువల్స్ తోడు అయితే.. మరో వండర్ ఫుల్ సినిమా అయ్యే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు