మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా దిగ్గజ దర్శకడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ భారీ యాక్షన్ పొలిటికల్ పాన్ ఇండియన్ మూవీ గేమ్ ఛేంజర్. ప్రారంభం నాటి నుండి ఈ భారీ ప్రాజక్ట్ పై అటు రామ్ చరణ్ ఫ్యాన్స్ తో పాటు యావత్ ఆడియన్స్ అందరిలో కూడా ఎన్నో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.
రామ్ చరణ్ ఈ మూవీలో డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు టాక్. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని దిల్ రాజు నిర్మిస్తున్నారు. అయితే విషయం ఏమిటంటే, గేమ్ ఛేంజర్ రిలీజ్ కోసం రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎప్పటినుండో ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. కాగా లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల బజ్ ప్రకారం ఈ మూవీని 2025 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారని అంటున్నారు.
ప్రస్తుతం మరోవైపు కమల్ హాసన్ తో ఇండియన్ 2 మూవీ కూడా చేస్తున్న శంకర్, దానికి సీక్వెల్ గా ఇండియన్ 3 ని కూడా తీయనున్నారని వీటి రెండిటి రిలీజ్ అనంతరమే గేమ్ ఛేంజర్ ఆడియన్స్ ముందుకి వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలి అంటే ఆ మూవీ మేకర్స్ నుండి రిలీజ్ కి సంబంధించి అఫీషియల్ అప్ డేట్ అయితే రావాల్సిందే.