“లియో” ఓటిటి వెర్షన్ పై ఇంట్రెస్టింగ్ బజ్.!

Published on Nov 21, 2023 10:00 am IST

ఇళయ దళపతి విజయ్ హీరోగా త్రిష హీరోయిన్ గా దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన లేటెస్ట్ భారీ హిట్ చిత్రం “లియో”. ఈ ఏడాదిలో తమిళ సినిమా నుంచి మరో పెద్ద హిట్ గా ఈ సినిమా నిలవగా విజయ్ కెరీర్ లోనే కాకుండా లోకేష్ కనగరాజ్ కెరీర్ లో కూడా ఈ చిత్రం హైయెస్ట్ గ్రాసర్ గా అయితే నిలిచింది. మరి ఈ చిత్రం ఓటిటి రిలీజ్ పై దిగ్గజ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ వారు నిన్ననే రెండు డేట్స్ లో అయితే అనౌన్స్ చేసేసారు.

దీనితో ఈ ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయగా వీటితో ఈ చిత్రం అన్ కట్ వెర్షన్ లో రిలీజ్ అవుతున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. థియేట్రికల్ వెర్షన్ లో చూసిన దానికి ఓటిటిలో చూస్తున్న దానికి కొన్ని తేడాలు కనిపించడంతో “లియో” అన్ వెర్షన్ లోనే రాబోతున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. అయితే ఇది ఇండియాలో కూడా ఉంటుందా లేక గ్లోబల్ గా మాత్రమేనా అనేది మాత్రం ఈ సినిమా వచ్చేవరకు ఆగితే తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :