టాక్..”గాడ్ ఫాదర్” కోసం రంగం సిద్ధం చేస్తున్నారట.!

Published on May 24, 2022 5:00 pm IST

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రస్తుతం పలు భారీ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే వాటిలో రెండు రీమేక్ సినిమాలు ఉండగా వాటిలో ఒకటి ఈ ఏడాదిలోనే రిలీజ్ కానుంది అని తెలుస్తుంది. మరి ఆ సినిమానే “గాడ్ ఫాదర్”. దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ పై లేటెస్ట్ గా ఓ బజ్ వినిపిస్తుంది.

దీని ప్రకారం అయితే ఈ సినిమాకి గాను రానున్న రోజుల్లో మేకర్స్ వరుస అప్డేట్స్ కోసం రంగం సిద్ధం చేస్తున్నారట. సినిమాపై హైప్ ని ప్రామిసింగ్ గా ఉంచే విధంగా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ని రానున్న రోజుల్లో ప్లాన్ చేస్తున్నట్టు టాక్. మరి ఈ సినిమాకి అయినా మంచి ప్రమోషన్స్ చేస్తారో లేదో చూడాలి. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ తో పాటుగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా ఒక కీలక పాత్ర చేస్తుండగా నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే థమన్ సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :