మెగాస్టార్ 157 మూవీ పై ఇంట్రెస్టింగ్ బజ్

Published on Sep 19, 2023 3:00 am IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బింబిసార దర్శకుడు మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో తాజాగా ఒక భారీ సోషియో ఫాంటసీ మూవీ రూపుదిద్దుకోనున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ కెరీర్ 157వ మూవీగా తెరకెక్కనున్న ఈ మూవీ పై మెగాస్టార్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. యువి క్రియేషన్స్ బ్యానర్ పై గ్రాండ్ లెవెల్లో నిర్మితం కానున్న ఈమూవీ యొక్క కాన్సెప్ట్ పోస్టర్ ఇప్పటికే రిలీజ్ అయి అందరినీ ఆకట్టుకుంది.

ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందించనున్న ఏ మూవీకి చోట కె నాయుడు ఫోటోగ్రఫి అందించనున్నారు. ఇక ఈ మూవీ లో అనుష్క ఒక హీరోయిన్ గా నటించనుండగా ఇందులో ముగ్గురు లేదా నలుగురు హీరోయిన్స్ నటించే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఈ మూవీలో మెగాస్టార్ రోల్ పవర్ఫుల్ గా ఉండడంతో పాటు ఫ్యాన్స్ ని ఆకట్టుకునేలా సాగుతుందట. ఇక ఈ మూవీ గురించిన మరిన్ని విషయాలు అతి త్వరలో వెల్లడి కానున్నాయి. త్వరలో ప్రారంభం కానున్న ఈ మూవీ ని వచ్చే ఏడాది ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారట.

సంబంధిత సమాచారం :