వెండి తెర ఆరంగేట్రానికి సిద్దమైన మెగాస్టార్ అల్లుడు !
Published on Dec 8, 2017 9:27 am IST

మెగాస్టార్ చిరంజీవీగారి చిన్న కుమార్తె శ్రీజ భర్త అయిన కళ్యాణ్ కనుగంటి వెండి తెర ఎంట్రీపై చాలా రోజుల నుండి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు నటనలో, మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకున్న కళ్యాణ్ స్టైలిష్ మేకోవర్ తో ఎంట్రీకి సిద్ధంగా ఉన్నారని సినీ వర్గాల చెబుతున్నాయి.

ఈయన్ను ‘జత కలిసే’ చిత్ర దర్శకుడు రాకేష్ శశి చిత్రంతో లాంచ్ చేయాలనే ఆలోచనలో ఉందట మెగా ఫ్యామిలీ. ఇప్పటికే కథా చర్చలు జరుగుతున్నాయని, రామ్ చరణ్ దగ్గరుండి స్వయంగా అన్ని వ్యవహారాల్ని చూసుకుంటున్నారని, చిరంజీవి ఆమోదం పొందిన వెంటనే ప్రాజెక్ట్ పాటలెక్కుతుందని అంటున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి నిర్మిస్తారట. మరి ఈ సంగతులన్నింటిపై స్పష్టత రావాలంటే మెగా కాంపౌండ్ నుండి కన్ఫర్మేషన్ వచ్చే వరకు వేచి చూడాలి.

 
Like us on Facebook