నితిన్ “ఎక్స్ట్రార్డినరీ మ్యాన్” పై ఇంట్రెస్టింగ్ బజ్.!

Published on Sep 18, 2023 12:40 pm IST

మన టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా దర్శకుడు వక్కంతం వంశీ తెరకెక్కించిన ఇంట్రెస్టింగ్ చిత్రమే “ఎక్స్ట్రార్డినరీ మ్యాన్”. మరి సినిమా ఫస్ట్ లుక్ కానీ ఫస్ట్ సింగిల్ తో మంచి బజ్ ని అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు అన్ని పనులు ముగించుకునే పనిలో ఉంది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాపై అయితే ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది.

దీని ప్రకారం అయితే ఈ చిత్రంలో నితిన్ ఓ జూనియర్ ఆర్టిస్ట్ గా కనపడతాడు అని ఈ రోల్ ని దర్శకుడు బ్యూటిఫుల్ గా షేప్ అవుట్ చేయగా దాని నుంచి మంచి ఫన్ తో కూడిన ఎంటర్టైన్మెంట్ ని నితిన్ అందివ్వబోతున్నాడు అని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇక ఈ చిత్రానికి అయితే క్లాసిక్ మ్యూజిక్ డైరెక్టర్ హారీశ్ జై రాజ్ సంగీతం అందిస్తుండగా శ్రేష్ట్ మూవీస్ మరియు ఆదిత్య మూవీస్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :