“ఎన్టీఆర్ 31” పై ఇంట్రెస్టింగ్ బజ్.!

Published on Jun 7, 2023 1:58 pm IST


ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా “దేవర” కోసం తెలిసిందే. మరి ఈ చిత్రం అయితే ఇప్పుడు శరవేగంగా కంప్లీట్ అవుతుండగా ఈ సినిమా తర్వాత తారక్ నుంచి సెన్సేషనల్ లైనప్ కూడా ఉంది.

ఇక ఎన్టీఆర్ కెరీర్ లో 30వ సినిమాని ఇప్పుడు కొరటాలతో చేస్తుండగా నెక్స్ట్ 31వ సినిమా అయితే పాన్ ఇండియా దర్శకుడు ప్రశాంత్ నీల్ తో అనౌన్స్ కూడా చేశారు. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే దానిపై ఇంట్రెస్టింగ్ బజ్ అయితే ఇప్పుడు సినీ వర్గాలు నుంచి వినిపిస్తుంది.

అయితే ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ టు హాలీవుడ్ టర్న్డ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా జోనస్ నటించనుంది అని అంటూ కొన్ని రూమర్స్ ఇప్పుడు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో కాలమే నిర్ణయించాలి.

సంబంధిత సమాచారం :