‘ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్’ సినిమా స్టార్ట్ అయ్యేది, రిలీజ్ అయ్యేది అప్పుడే

Published on May 9, 2022 7:01 am IST

ఎన్టీఆర్ ఫ్యాన్స్ దృష్టి మొత్తం ఇప్పుడు ప్రశాంత్ నీల్ తో చేయబోయే సినిమా పైనే ఉంది. పాన్ ఇండియా డైరెక్టర్ గా ప్రశాంత్ నీల్ కి ఫుల్ డిమాండ్ క్రియేట్ అయ్యింది. పైగా ఎన్టీఆర్ తో భారీ యాక్షన్ డ్రామాను తెరకెక్కించాలని ప్రశాంత్ నీల్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ 31వ సినిమాగా ఈ చిత్రం రాబోతుంది. కాగా తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ రూమర్ వినిపిస్తోంది.

ఈ సినిమాని దసరాకి అధికారికంగా లాంచ్ చేసి.. నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరపాలని మేకర్స్ ప్లాన్ చేశారట. అలాగే.. 2024 దసరాకి సినిమాని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కలయికలో సినిమా వస్తోంది అనేసరికి నేషనల్ రేంజ్ లో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ కి, ప్రశాంత్ నీల్ విజువల్స్ తోడు అయితే.. మరో వండర్ ఫుల్ సినిమా అయ్యే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం :