పవన్ – హరీష్ శంకర్ సినిమా పై ఇంట్రెస్టింగ్ బజ్ !

పవన్ – హరీష్ శంకర్ సినిమా పై ఇంట్రెస్టింగ్ బజ్ !

Published on Dec 19, 2022 8:01 PM IST

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఎన్టీఆర్ సినిమాలో నటిస్తోంది అంటూ ఇప్పటికే రూమర్స్ వినిపించాయి. తెలుగు సినిమాలు చేయడానికి జాన్వీ కపూర్ బాగా ఆసక్తిగా ఉందట. రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కూడా తన తల్లి శ్రీదేవి చేసిన సౌత్ సినిమాలు అంటే.. తనకు బాగా ఇష్టం అని.. అందుకే తాను కూడా సౌత్ సినిమాలు చేయాలనుకుంటున్నట్లు జాన్వీ కపూర్ చెప్పుకొచ్చింది. కాగా తాజాగా హరీష్ శంకర్ – పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో జాన్వీ కపూర్ ను తీసుకునే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని టాక్ నడుస్తోంది.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లుక్ కూడా అదిరిపోతోందట. అందుకు తగ్గట్టుగానే తన పాత్ర కోసం పవన్ కూడా డిఫరెంట్ మేకోవర్‌ ట్రై చేయనున్నాడు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన గబ్బర్ సింగ్ పెద్ద హిట్ కావడంతో ఈ సినిమా పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు