పవన్ కళ్యాణ్ ‘ఓజి’ స్టోరీ పై ఇంట్రెస్టింగ్ బజ్

Published on Sep 15, 2023 1:00 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లేటెస్ట్ భారీ మాస్ యాక్షన్ గ్యాంగ్ స్టర్ డ్రామా మూవీ ఓజి. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ గా పవర్ ఫుల్ రోల్ చేస్తుండగా ఆయనకు జోడీగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈమూవీ నుండి ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ గ్లింప్స్ హంగ్రీ చీతా కి సూపర్ గా రెస్పాన్స్ లభించడంతో పాటు అది పవన్ ఫ్యాన్స్ లో అలానే ఆడియన్స్ లో మూవీ పై భారీ అంచనాలు ఏర్పరిచింది.

ఇక ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ యొక్క స్టోరీ కి సంబంధించి ప్రస్తుతం ఒక న్యూస్ ప్రచారం అవుతోంది. దాని ప్రకారం ముంబై నగరానికి ఒక సాధారణ వ్యక్తిగా వచ్చిన ఓజాస్ గంభీర అనే టూరిస్ట్ కొన్ని అనుకోని పరిస్థితుల్లో గ్యాంగ్ స్టర్ గా మారడం, అనంతరం అతడి చర్యల వలన కుటుంబాన్ని కోల్పోవడం జరుగుతుందట. అనంతరం శత్రువుల పై అతడు ఏవిధంగా రివేంజ్ తీర్చుకుంటాడు అనే కథాంశంతో ఓజి తెరకెక్కుతున్నట్లు ప్రముఖ ఇంటర్నెట్ రేటింగ్ సంస్థ ఐఎండీబీ వారి పోర్టల్ లో పోస్ట్ చేయబడింది.

అయితే మరి ఈ కథ నిజంగానే ఓజి మూవీ దేనా లేదా ఏదైనా మార్పు ఉన్నదా అనేది తెలియాలి అంటే మాత్రం మూవీ రిలీజ్ వరకు ఆగాల్సిందే. పవన్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ ని కూడా థ్రిల్ చేసే విధంగా ఎన్నో యాక్షన్ బ్లాక్స్ తో దర్శకుడు సుజీత్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఓజి మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి వచ్చే ఏడాది సమ్మర్ లో ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చే అవకాశం కనపడుతోంది.

సంబంధిత సమాచారం :