“పుష్ప” సెకండ్ సింగిల్ పై ఇంట్రెస్టింగ్ బజ్.!

Published on Sep 27, 2021 7:01 am IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మికా మందన్నా హీరోయిన్ గా మన టాలీవుడ్ మోస్ట్ ఇంటెలిజెంట్ దర్శకుడు సుకుమార్ కాంబోలో తెరకెక్కుస్తున్న “పుష్ప” కోసం అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం మొత్తం రెండు భాగాలుగా తెరకెక్కుతుంది. మరి ఇదిలా ఉండగా ఈ సినిమా విషయంలో అభిమానులు ఎప్పుడు నుంచి సెకండ్ సింగిల్ కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే నిజానికి ఈ పాట ఈ నెలలోనే రావాల్సి ఉంది కానీ ఎందుకో లేట్ అయ్యింది. ఇప్పుడు దీనిపై మరింత ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. ఫస్ట్ చార్ట్ బస్టర్ మొత్తం 5 భాషల్లో రికార్డు చేసి ఒకేసారి మేకర్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. మరి అలానే ఇప్పుడు రెండో సాంగ్ కూడా పలు భాషల్లో స్టార్ సింగర్స్ చేత దేవి ఆల్రెడీ పాడిస్తున్నాడట.

అంతే కాకుండా ఆల్రెడీ నాలుగు భాషల్లో సాంగ్స్ రికార్డ్ చేసినట్టు తెలుస్తుంది. ఇంకొకటి కూడా కంప్లీట్ చేస్తే త్వరలోనే ఈ సాంగ్ ని కూడా రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. మరి ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

సంబంధిత సమాచారం :