“రాధే శ్యామ్” ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడేనా.?

Published on Oct 31, 2021 8:06 am IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియన్ సినిమా “రాధే శ్యామ్” కోసం అందరికీ తెలిసిందే. వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ తో అంతకు మించిన ప్రేమకథతో ఈ చిత్రం సిద్ధం అవుతుండగా రీసెంట్ గా వచ్చిన టీజర్ కి కూడా భారీ రెస్పాన్స్ వచ్చింది.

మరి ఇదిలా ఉండగా ఈ మోస్ట్ అవైటెడ్ అప్డేట్ తర్వాత అంతలా ఎదురు చూస్తున్న మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఈ సినిమా ఫస్ట్ సింగిల్ కోసమే. చాలా కాలం తర్వాత ప్రభాస్ చేసిన లవ్ స్టోరీ కాబట్టి పాటలపై మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ ఫస్ట్ సింగిల్ పై లేటెస్ట్ బజ్ ఒకటి వినిపిస్తుంది.

దీని ప్రకారం ఈ వచ్చే నవంబర్ లోనే రిలీజ్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. అలాగే బహుశా మూడో వారంలో ఉండొచ్చట. అలాగే దీపావళి కానుకగా రెండో టీజర్ కూడా ఉందని బజ్ ఉంది. మరి వీటిపై మరింత సమాచారం రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :

More