“రాధే శ్యామ్” ట్రైలర్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్స్.!

Published on Dec 7, 2021 5:03 pm IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కించిన భారీ చిత్రం “రాధే శ్యామ్” కోసం అందరికీ తెలిసిందే. అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ ఆడియెన్స్ లో కూడా సాలిడ్ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం నుంచి వస్తున్న ఒకో అప్డేట్ మరింత ఆసక్తిని ఈ చిత్రంపై రేపుతోంది.

అయితే ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి మరో బిగ్గెస్ట్ మోస్ట్ అవైటెడ్ అప్డేట్ అయినటువంటి ట్రైలర్ పై ఆసక్తికర సమాచారం వినిపిస్తుంది. దీని ప్రకారం ఈ సినిమా ట్రైలర్ కట్ ఆల్రెడీ రెడీ అయ్యిందట. అందరి అంచనాలు ఎన్నైతే ఉన్నాయో వాటి అన్నిటినీ మ్యాచ్ చేసే విధంగా ఉంటుందట.

అలానే చాలా గ్రాండ్ విజువల్స్ మంచి క్లాసీ షాట్ లు ప్రతి ఒక్కరినీ ఎంతో ఆశ్చర్యపరుస్తాయట. మరి ఈ ట్రైలర్ రిలీజ్ పై కూడా టాక్ వినిపిస్తుంది. ఇది ఈ డిసెంబర్ 17న కానీ ఆ తర్వాత కానీ రిలీజ్ కానుందట. ఇక ఈ భారీ సినిమాకి ముగ్గురు సంగీత దర్శకులు వర్క్ చేస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :