రజినీ “జైలర్” రిలీజ్ పై ఇంట్రెస్టింగ్ బజ్.!

రజినీ “జైలర్” రిలీజ్ పై ఇంట్రెస్టింగ్ బజ్.!

Published on Oct 23, 2022 10:00 PM IST


తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ప్రస్తుతం నటిస్తున్న లేటెస్ట్ సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “జైలర్” కోసం అందరికీ తెలిసిందే. స్టార్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ చిత్రం పై భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి. మరి ఈ సినిమా షూటింగ్ అయితే మేకర్స్ శరవేగంగా తెరకెక్కిస్తుండగా లేటెస్ట్ గా సినిమా రిలీజ్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ బజ్ అయితే వినిపిస్తుంది.

ఈ చిత్రాన్ని మేకర్స్ మొదట తమిళ్ లోనే అనౌన్స్ చేసినా తెలుగు రిలీజ్ కూడా ఎలాగో ఉంటుంది అని తెలిసిందే. అయితే ఈసారి జైలర్ ని పాన్ ఇండియా రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తుంది. రజినీ నుంచి లాస్ట్ చిత్రం “అన్నాత్తే” పాన్ ఇండియా రిలీజ్ మిస్ అయ్యింది. కానీ ఈసారి జైలర్ తో తలైవర్ రానున్నట్టుగా సినీ వర్గాల్లో లేటెస్ట్ టాక్. ఇక ఈ చిత్రానికి అయితే అనిరుద్ సంగీతం అందిస్తుండగా సన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు