“జైలర్” లో రజినీ రోల్ పై మరో ఇంట్రెస్టింగ్ బజ్.!

Published on Feb 10, 2023 9:00 am IST

కోలీవుడ్ సూపర్ స్టార్ తలైవర్ రజినీకాంత్ హీరోగా మోహన్ లాల్, జాకీ ష్రాఫ్, కె ఎస్ రవికుమార్, సునీల్, తమన్నా తదితర భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఇంట్రెస్టింగ్ యాక్షన్ డ్రామా చిత్రం “జైలర్” కోసం తెలిసిందే. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై సాలిడ్ హైప్ కూడా నెలకొనగా ఇప్పుడు సినిమా షూటింగ్ శరవేగంగా తెరకెక్కుతుంది.

ఇక ఇదిలా ఉండగా ఈ భారీ సినిమాపై మరో ఇంట్రెస్టింగ్ బజ్ అయితే ఇప్పుడు తెలుస్తుంది. ఈ చిత్రం ఇది వరకే ఒక రాత్రి లోనే నడిచే స్టోరీ లా ఉంటుంది అని టాక్ ఉంది. మరి రజినీ రోల్ ఆల్రెడీ ఓ జైలు లో వర్క్ చేస్తున్న జైలర్ గా కాకుండా ఓ రిటైర్డ్ జైలర్ గా అయితే తాను కనిపిస్తారట. అలా తనపై సినిమాలో కథనం ఉండనుందట. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా సన్ పిక్చర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :