శంకర్ – చరణ్ ల బిగ్ ప్రాజెక్ట్ ఫస్ట్ లుక్ పై ఇంట్రెస్టింగ్ బజ్.!

Published on May 18, 2022 2:00 pm IST

ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ పాన్ ఇండియా సినిమా దగ్గర మరో టాప్ దర్శకుడు అయినటువంటి శంకర్ తో ఒక భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు నుంచే ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై అనేక అంచనాలు నెలకొనగా ఈ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ ల కోసం అయితే మెగా ఫ్యాన్స్ ఎప్పుడు నుంచో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే ఇప్పుడు సినీ వర్గాల్లో ఈ సినిమా ఫస్ట్ లుక్ పై ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. దీని ప్రకారం అయితే ఈ మోస్ట్ అవైటెడ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని శంకర్ ఈ ఏడాది ఆగస్ట్ లో రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారట. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది. అయితే ఈ సినిమా కూడా శంకర్ మార్క్ లోనే ఉండే ఒక సోషల్ డ్రామా అని తెలిసిందే. ఆ రకంగా అయితే ఆగస్ట్ 15న ఏమన్నా వస్తుందేమో చూడాలి. మొత్తానికి అయితే ఈ అప్డేట్ పై క్లారిటీకి కాలమే ఇవ్వాలి.

సంబంధిత సమాచారం :