మెగాస్టార్ సినిమా కోసం రవితేజ అంత డిమాండ్ చేశాడా ?

మెగాస్టార్ సినిమా కోసం రవితేజ అంత డిమాండ్ చేశాడా ?

Published on Mar 14, 2022 10:00 AM IST

మెగాస్టార్ చిరంజీవితో యంగ్ డైరెక్టర్ కె.ఎస్‌. రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో ఓ పవర్ ఫుల్ మాస్ ఎంటర్టైనర్ చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు రవితేజ కూడా ఓ ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ సినిమా కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. రవితేజ ఏకంగా రూ.10 కోట్లు తీసుకుంటున్నాడట.

ఇక ఈ చిత్రంలో చిరు సరసన హీరోయిన్ గా శృతి హాసన్ నటించబోతుంది. అయితే, ఇప్పుడు మెగాస్టార్ సరసన మరో హీరోయిన్ పేరు వినిపిస్తోంది. మాళవిక మోహన్, మెగాస్టార్ కి హీరోయిన్ గా నటించబోతుందట. మరి చిరు – మాళవిక మోహన జోడీ నిజంగానే బాగుంటుంది. ఐతే, ఈ వార్తల పై ఇంతవరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు. ఇక బాబీ చిరుకు పూర్తి కథను కూడా వివరించాడని, కథ చిరుకి బాగా నచ్చిందని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు