“లియో” లో సంజయ్ దత్ రోల్ పై ఇంట్రెస్టింగ్ బజ్.!

Published on May 19, 2023 7:59 am IST

ప్రస్తుతం కోలీవుడ్ సినిమా దగ్గర భారీ హైప్ తో కూడుకొని ఉన్న పలు సాలిడ్ ప్రాజెక్ట్ లలో ఇళయ దళపతి విజయ్ హీరోగా త్రిష హీరోయిన్ గా దర్శకుడు లోకేష్ కనగ రాజ్ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “లియో” కూడా ఒకటి. మరి లోకేష్ తన సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఈ చిత్రాన్ని చేస్తుండడంతో అందరిలో కూడా మంచి హైప్ అయితే నెలకొంది.

ఇక ఇదిలా ఉండగా ఈ సాలిడ్ ప్రాజెక్ట్ లో ప్రముఖ బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ కూడా కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాను అసలు ఈ సినిమాలో ఎలాంటి రోల్ లో కనిపించనున్నారో తెలుస్తుంది. ఈ సినిమాలో సంజయ్ విజయ్ పాత్రకి తండ్రిగా కనిపిస్తారట. అలాగే తన పోర్షన్స్ ని 1940 ల సమయంలో గ్యాంగ్ స్టర్ గా అయితే చూపించనున్నారని కూడా తెలుస్తుంది. దీనితో అయితే లోకేష్ మాత్రం ఒకొకరికి సాలిడ్ క్యారెక్టరైజేషన్ ని ప్లాన్ చేసాడని చెప్పాలి.

సంబంధిత సమాచారం :