ఓటిటిలో “సంక్రాంతికి వస్తున్నాం” రిలీజ్ పై ఇంట్రెస్టింగ్ బజ్

ఓటిటిలో “సంక్రాంతికి వస్తున్నాం” రిలీజ్ పై ఇంట్రెస్టింగ్ బజ్

Published on Feb 18, 2025 8:59 AM IST

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా మన టాలీవుడ్ నుంచి రిలీజ్ కి వచ్చిన చిత్రాల్లో రీజనల్ ఇండస్ట్రీ హిట్ చిత్రం “సంక్రాంతికి వస్తున్నాం” కోసం తెలిసిందే. వెంకీ మామ హీరోగా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా ఏకంగా 300 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టి ట్రేడ్ వర్గాల్లో అందరికీ షాకిచ్చింది.

అయితే ఈ సినిమా వచ్చి ఇపుడు నెల అయ్యిపోయింది కానీ మిగతా సినిమాల్లా ఓటిటి రిలీజ్ పై మాత్రం ఇంకా ఎలాంటి అప్డేట్ లేదు. అయితే ఈ సినిమాని జీ సంస్థ వారే శాటిలైట్ సహా ఓటిటి హక్కులు కూడా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇలా మొదట జీ తెలుగులో టెలికాస్ట్ అనౌన్సమెంట్ వచ్చేసింది. అయితే ఇది మంచి మూవ్ అయినప్పటికీ ఓటిటి రిలీజ్ పై ఇంట్రెస్టింగ్ బజ్ ఇపుడు వినిపిస్తుంది.

టీవిలో వచ్చిన ఒకటి లేదు రెండు రోజుల గ్యాప్ లోనే సంక్రాంతికి వస్తున్నాం ఓటిటిలో వచ్చేసే ఛాన్స్ ఉన్నట్టుగా ఇపుడు టాక్. మరి జీకి సంబంధించి గత కొన్ని సినిమాలు కూడా ఇదే స్ట్రాటజీలో రావడం జరిగింది. సో ఇదే ఫార్మాట్ లో సంక్రాంతికి వస్తున్నాం కూడా రావచ్చు. సో టెలికాస్ట్ డేట్ ఎపుడు అనేది ఇంకా ఫైనల్ కావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు