“సర్కారు వారి పాట” రిలీజ్ పై ఇంట్రెస్టింగ్ బజ్.!

Published on Oct 29, 2021 10:33 pm IST


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న భారీ సినిమా “సర్కారు వారి పాట”. స్టైలిష్ అండ్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా తాజాగా స్పెయిన్ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చింది అంతే కాకుండా మూడు సాంగ్స్ కూడా కంప్లీట్ చేసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ సినిమా రిలీజ్ పట్ల గత కొన్ని రోజులు నుంచి ఓ టాక్ అయితే ఉంది.

మొదటగా సంక్రాంతి బరిలో ఉన్న ఈ సినిమా పాన్ ఇండియన్ సినిమా “రౌద్రం రణం రుధిరం” ఉండేసరికి మహేష్ రాజమౌళి కోసం డేట్ మార్చుకుంటాడు అని టాక్ వినిపించింది కానీ అందులో కన్ఫర్మేషన్ అయితే రాలేదు. ఇక ఇప్పుడు అయితే ఓ బజ్ వినిపిస్తుంది. ఈ సినిమా వేసవి రేస్ లోకి షిఫ్ట్ అయ్యే సూచనలు ఉన్నాయట. కానీ మరోపక్క “RRR” సినిమా రిలీజ్ డేట్ పై కూడా కాస్త సస్పెన్స్ నెలకొనగా దీనిపై కూడా క్లారిటీ వస్తే రెండిటికీ సమాధానం దొరికేసినట్టే అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :

More