టాక్..ప్రభాస్ ఫ్రెండ్స్ తో సూర్య ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్..?

Published on Jul 5, 2022 8:00 am IST


కోలీవుడ్ మరియు మన తెలుగులో కూడా మంచి ఆదరణ ఉన్న కొద్ది మంది హీరోలలో స్టార్ హీరో సూర్య కూడా ఒకడు. మరి తాను రీసెంట్ గా నటించిన “విక్రమ్” క్యామియోతో తమిళ్ తో పాటుగా మన తెలుగులో కూడా సెన్సేషనల్ రెస్పాన్స్ రాగా ఇక నెక్స్ట్ సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ ఇదిలా ఉండగా సూర్య లైనప్ పై ఇప్పుడు ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది.

గత కొన్ని రోజులు నుంచి కూడా సూర్య మరియు స్టార్ దర్శకుడు శివ కాంబోలో ఓ సినిమా వస్తుందని టాక్ ఉండగా ఇప్పుడు ఈ సినిమాని మన టాలీవుడ్ హీరో ప్రభాస్ ఫ్రెండ్స్ బ్యానర్ అయినటువంటి యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహించనున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ తరహా కాంబోలో అయితే యూవీ క్రియేషన్స్ నుంచి కూడా కొత్తే అని చెప్పాలి. మరి ఈ టాక్ ఎంతవరకు నిజం అనేది కాలమే నిర్ణయించాలి.

సంబంధిత సమాచారం :