ఇంట్రెస్టింగ్..తన “రోబో” గర్ల్ తో మరోసారి తలైవర్..!

Published on Jun 8, 2022 8:00 am IST


ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ తలైవర్ రజినీకాంత్ హీరోగా ప్రస్తుతం కోలీవుడ్ హిట్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తో ఒక భారీ సినిమాను తన కెరీర్ లో 169వ చిత్రంగా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం జూలై నుంచి స్టార్ట్ కాబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ సినిమాపై నిన్ననే మేకర్స్ ఒక బిగ్ అనౌన్సమెంట్ కూడా ఇచ్చారు. ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమా పై ఇంట్రెస్టింగ్ టాక్ ఒకటి వినిపిస్తుంది.

ఈ చిత్రంలో సూపర్ స్టార్ సరసన మరోసారి ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ హీరోయిన్ గా నటించబోతున్నట్టుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి ఈ కాంబోలో ఇది వరకే “రోబో” సినిమా చూసాము. మరి ఇది నిజం అయితే మళ్ళీ ఇప్పుడు చూడబోతున్నామని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా సన్ పిక్చర్స్ మరియు ఏ జి ఎస్ స్టూడియోస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :