ప్రస్తుతం మన టాలీవుడ్ సినిమా దగ్గర నుంచి రానున్న పలు భారీ చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘జై హనుమాన్’ కూడా ఒకటి. కన్నడ స్టార్ నటుడు రిషబ్ శెట్టి హనుమాన్ గా యంగ్ హీరో తేజ సజ్జ కూడా కనిపించనున్న ఈ సినిమాని చాలా కాలం గ్యాప్ తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్ గా పట్టాలెక్కించారు.
అయితే ఈ సినిమాకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ బజ్ ఇప్పుడు వినిపిస్తుంది. దీని ప్రకారం లేటెస్ట్ ట్రెండింగ్ బ్యూటీ వామికా గబ్బి ఈ చిత్రంలో కనిపించనుంది అని తెలుస్తుంది. లేటెస్ట్ గానే కోలీవుడ్ సూపర్ హిట్ చిత్రం ‘డిసి’ లో ఆమె పెర్ఫామెన్స్ కి అందరిలో మంచి మార్కులు పడ్డాయి.
ప్రస్తుతం ఈ సక్సెస్ ని ఆమె ఎంజాయ్ చేస్తున్న తరుణంలో ఈ భారీ సినిమాలో ఆమెకి ఆఫర్ అనే టాక్ మరింత ఎగ్జైటింగ్ గా మారింది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించనున్నట్టు కూడా రూమర్స్ ఉన్నాయి. అలాగే మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.
