ఇంట్రెస్టింగ్..”RRR” ట్రైలర్ రఫ్ గా ఇంతసేపు ఉంటుందా.?

Published on Nov 28, 2021 10:02 am IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శక ధీరుడు రాజమౌళి తీసిన భారీ పాన్ ఇండియన్ యాక్షన్ థ్రిల్లర్ “రౌద్రం రణం రుధిరం”. వరుస పెట్టి ఈ సినిమా నుంచి వస్తున్న అప్డేట్లు కూడా ఒకొక్కటి సినిమాపై మరింత అంచనాలు పెంచే దానిలా ఉన్నాయి.

ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం నుంచి రానున్న రోజుల్లో మరిన్ని సాలిడ్ అప్డేట్స్ కూడా ఉన్నాయి. అయితే వీటిలో డిసెంబర్ మొదటి వారంలో రిలీజ్ కానున్న మాసివ్ ట్రైలర్ కూడా ఒకటి. మరి దీనిపైనే ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తుంది.

ఈ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ ట్రైలర్ ని రాజమౌళి మైండ్ బ్లోయింగ్ విజువల్స్ తో దాదాపు మూడు నిమిషాల నిడివి పాటు ఉండేలా కట్ చేశారట. భారీ యాక్షన్ సీక్వెన్స్ లు మరిన్ని అద్భుతమైన ఎమోషన్స్ తో ఈ ఈ ట్రైలర్ ఉంటుందని టాక్. మరి దీనికోసం ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :