“భీమ్లా నాయక్” లో పవన్ రోల్ కి సంబంధించి ఆసక్తికర నిజం.!

Published on Nov 10, 2021 4:00 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ చిత్రం “భీమ్లా నాయక్” చేస్తున్న సంగతి తెలిసిందే. మాస్ ఆడియెన్స్ లో సెపరేట్ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రంపై ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ కి బయట ఏ స్థాయి అభిమాన ఆదరణ ఉందో అందరికీ తెలుసు. అలానే పవన్ కి కూడా తన అభిమానుల పట్ల అపారమైన గౌరవం కూడా ఉంది.

ఇప్పుడు దీనికి సంబంధించిన నిజమే తెలుస్తుంది. ఆ మధ్య తెనాలి నుంచి పవన్ వద్దకు వచ్చిన చెప్పులు కొట్టుకునే సాధారణ అభిమాని కొన్ని జతల చెప్పులను తాను తయారు చేసినవి పవన్ కి ఇవ్వడం జరిగింది. మరి వాటినే పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాలో ఇప్పటి వరకు వాడారట. దీనితో పవన్ పై వారి అభిమానులకి మరింత గౌరవం పెరిగినట్టు అయ్యింది.

సంబంధిత సమాచారం :

More