మునుపెన్నడూ చేయని పాత్రలో సూర్య – డైరెక్టర్ లోకేష్ కనగరాజు

Published on May 24, 2022 6:16 pm IST

కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న విక్రమ్ సినిమాలో సూర్య అతిధి పాత్రలో నటిస్తున్నాడనేది ఇప్పటి వరకు అందరికి తెలిసిన విషయమే. డైరెక్టర్ లోకేష్ కనగరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా సూర్య పాత్ర పై డైరెక్టర్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

“సూర్య ఇంతవరకు చేయని పాత్రలో కనిపిస్తాడు. త్వరగా అడాప్ట్ అయ్యి చేసాడు. నేను అతనికి ఎక్కువ సమయం ఇవ్వలేదు” అని లోకేష్ చెప్పారు. “మా సెట్స్‌లో ఉండటం చాలా సాహసోపేతమైన అనుభవంగా సూర్య భావించాడు” అంటూ చెప్పుకొచ్చారు. రోజురోజుకూ ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కమల్ హాసన్, ఫాహద్ ఫాసిల్, విజయ్ సేతుపతి వంటి స్టార్లు కీలక పాత్రలు పోషిస్తుండడంతో ఈ సినిమా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారిపోయింది.

సంబంధిత సమాచారం :